Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కన్నడలోనూ బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ ఏ ఈవెంట్ కి హాజరైన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో సక్సెస్ చేస్తారో తెలిసిందే. ఇటీవల వైజాగ్ లో నిర్వహించిన ఫ్యాన్ మీట్ తోనే బన్నీ రేంజ్ ఏంటో అర్థమవుతుంది. అభిమానుల తాకిడి తట్టుకోలేక ఫోటో షూట్ నే క్యాన్సిల్ చేశారు.
షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ను మీట్ అవుతూ ఉంటాడు. అలాగే వాళ్ళకెప్పుడు ఏ సాయం అవసరమైన చేస్తూ గొప్ప మనసును చాటుకుంటాడు. తాజాగా బన్నీ అభిమాని కుటుంబానికి అండగా నిలబడ్డారు. వివరాల్లోకి వెళితే.. అర్జున్ కుమార్ అనే అల్లు అర్జున్ అభిమాని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ట్రీట్‌మెంట్ చేయించాలంటే రెండు లక్షలు దాకా ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. అయితే అర్జున్ కుమార్ వద్ద అంత డబ్బు లేదు.
Also Read: అల్లు అర్జున్ పై కేసు నమోదు
విషయం తెలిసిన ఇతర అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. దాతలు సాయం చేయాలని కోరారు. ఈ విషయం గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడు వరకు చేరింది. ఆయన వెంటనే విషయాన్ని బన్నీకి వివరించారు. వెంటనే ఆయన రియాక్ట్ అయ్యాడు. ట్రీట్మెంట్‌కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోమని, దాన్ని తాను చెల్లిస్తానని అన్నారు. అభిమాని హీరో నుంచి సపోర్ట్ రావటంతో అర్జున్ కుమార్ ఆనందానికి అవధులు లేవు.
‘నాకు సాయం చేసిన నా హీరో అల్లు అర్జున్‌కి థాంక్స్. మీరు చేసిన సాయానికి నా వంతుగా వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాను. అలాగే శరత్ చంద్ర అన్నగారికి థాంక్స్. గ్రేట్ లీడర్ షిప్. మీరు చేసిన సాయానికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను’ అంటూ అభిమాని తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. అభిమాని కుటుంబానికి అల్లు అర్జున్ అండగా ఉండడంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తూ బన్నీని ప్రశంసిస్తున్నారు.
Thank you for helping me Annaya my hero @alluarjun ❤️🫶🏻 🤗 I wanted to express my personal gratitude for contributed. anna ❣️ &specially @imsarathchandra anna 🛐 Thank you for being a great example of leadership to me.🫡 I am forever thankful for this help anna 🤗❤️ pic.twitter.com/eB0fmdvHgV
— ᗩᖇᒎᑌᑎ ᛕᑌᗰᗩᖇ (@ArjunKumar_AAA) February 9, 2023