Allu Arjun : చాన్నాళ్ల తర్వాత పఠాన్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్. తాజాగా పఠాన్ వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో షారుఖ్ నెక్స్ట్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. షారుక్ తన నెక్స్ట్ మూవీ అట్లీ డైరెక్షన్ లో “జవాన్” చేస్తున్నాడు. అయితే ఇందులో క్యామియో రోల్ కోసం డైరెక్టర్ అట్లీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంప్రదించినట్టు సమాచారం.
ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 పై భారీ అంచనాలునెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. అయితే షారుఖ్ జవాన్ లో అల్లు అర్జున్ అదిరిపోయే క్యామియో ఓకే చేసాడని రూమర్స్ వచ్చాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ అయితే ఈ సినిమాలో పార్ట్ కాలేదని తనకి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వలన బన్నీ ఈ మాసివ్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి జవాన్ మూవీ నుంచి బన్నీ ఆల్ మోస్ట్ తప్పుకున్నట్టే. ఏదేమైనా బన్నీ ఫ్యాన్స్ పుష్ప ది రూల్ నుంచి గ్లిమ్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.