Allu Arjun – Sandeep Reddy Vanga Movie : “పుష్ప” మూవీ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. “తగ్గేదే లే..” అంటూ టోటల్ ఇండియా మొత్తం ఐకాన్ స్టార్ పేరు మారు మ్రోగిపోయింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప – 2 సినిమా తో బిజీగా ఉన్నాడు. తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో మూవీ చేయాల్సి ఉంది. ఈ రెండూ లైన్ లో ఉండగానే క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సినిమాని కూడా లైన్ లో పెట్టేసాడు అల్లు అర్జున్. ఈ రోజే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉంది. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేశారు..
అయితే ఈ సినిమా 2025 లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ కి రెండు సినిమాలు లైన్ లో ఉండగా.. సందీప్ రెడ్డి ప్రస్తుతం రణబీర్ కపూర్ తో “యానిమల్” సినిమా చేస్తున్నాడు. ఇది ఈ సంవత్సరం రిలీజ్ అవుతుంది.
దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. అది 2024 లో ఉంటుంది అని అంచనా.. ఆ రెండు సినిమాలు కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.
అటు అల్లు అర్జున్.. ఇటు సందీప్ రెడ్డి వంగ.. వీళ్లిద్దరి కమిట్మెంట్స్ పూర్తయ్యాకే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది అని సమాచారం.
అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మాత్రం అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పుష్ప తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయితే.. అర్జున్ రెడ్డి హిట్ తో సందీప్ రెడ్డి ఇక్కడ ఎంత క్రేజ్ ని దక్కించుకున్నాడో.. దాన్ని రీమేక్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ తీసి అక్కడా బ్లాక్ బస్టర్ కొట్టాడు మనోడు. దాంతో ఏకంగా రణబీర్ తో యానిమల్ మూవీ తీసే అవకాశం దక్కించుకున్నాడు. అలా హీరో, డైరెక్టర్ ఇద్దరూ ఇండియా లెవల్ లో క్రేజ్ ఉన్నవాళ్లే కావడం తో వీళ్లిద్దరి కాంబినేషన్ పై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.