Allu Arjun: అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోల్లో ఆయన రేంజ్ అందరికీ తెలిసిందే. బన్నీ, రష్మిక నటించిన పుష్ప సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఇక ఫస్ట్ పార్ట్‌తో అదరగొట్టేసిన టీం.. సెకండ్ పార్ట్ ‘పుష్ప – ది రూల్’ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభించింది. కొద్ది రోజుల పాటు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ జరిపారు.
సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించారు. ఫారెస్ట్‌తో పాటు పలు అందమైన లొకేషన్లలో షూట్ చేశారు. తాజాగా షెడ్యూల్ పూర్తవ్వటంతో బన్నీ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ వైరలవుతోంది. వైజాగ్ బీచ్ ముందు నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేశారు. థాంక్యూ వైజాగ్ అంటూ పోస్ట్ చేశారు.
Also Read: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే.. దరిద్రం నెత్తిమీద ఉన్నట్టే
అలాగే విశాఖపట్నం ఎప్పటికైనా నాకు ప్రత్యేకమే అంటూ నోట్ రాశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వైజాగ్‌లో ఫోటో షూట్‌కు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఫ్యాన్స్ అత్యుత్సాహానికి ఏకంగా ఫోటో షూట్ రద్దయింది.