Allu Arjun : పుష్ప 1 (ది రైజ్) సెన్సేషనల్ హిట్ అవ్వడంతో పుష్ప 2 (ది రూల్) కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రైజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా పుష్పలో బన్నీ తగ్గేదెలే మ్యానరిజంకు వరల్డ్ వైడ్ గా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క తెలుగులోనే కాకుండా విడుదలైన అన్నీ భాషల్లోనూ కాసుల వర్షం కురిపించింది.
పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోగా హీరోయిన్ రష్మిక మందన్నాకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. డీగ్లామర్ రోల్ మెప్పించడమే కాకుండా సూపర్ హిట్ సాంగ్ సామీ నా సామీ అంటూ ఓ ఊపు ఊపేసింది శ్రీవల్లి. ప్రస్తుతం పుష్ప 2 షూట్ శరవేగంగా జరుగుతుంది. పుష్ప 2 నించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా పుష్ప 2 నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. అసలు పుష్ప ఎక్కడ అంటూ సాగే ఆ సెర్చింగ్ కు బన్నీ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 7న సాయంత్రం 4.05 నిమిషాలకు తెరపడనుంది. ఇక ఈ భారీ మూవీకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.
#WhereIsPushpa ?
The search ends soon!The HUNT before the RULE 🪓
Reveal on April 7th at 4.05 PM 🔥#PushpaTheRule ❤️🔥Icon Star @alluarjun @iamRashmika #FahadhFaasil @aryasukku @ThisIsDSP @SukumarWritings @PushpaMovie pic.twitter.com/djm4ClLeHg
— Mythri Movie Makers (@MythriOfficial) April 5, 2023