Amigos OTT: టాలీవుడ్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను చేస్తూ డీసెంట్ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న హీరో నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల బింబిసార చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఈ మూవీ సక్సెస్ అనంతరం కళ్యాణ్ రామ్ డెబ్యూ డైరెక్టర్ రాజేందర్ రెడ్డితో అమిగోస్ లో నటించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో 3 పాత్రల్లో నటించాడు.

ఫిబ్రవరి 10న థియేటర్ లో రిలీజ్ అయిన అమిగోస్ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్, కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ రోటీన్ నేరేషన్, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ అయ్యాయి. థియేటర్ బిసినెస్ పూర్తి చేసుకున్న అమిగోస్ ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
ఏప్రిల్ 1 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇందులో కళ్యాణ్ రామ్ కి జంటగా కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించగా బ్రహ్మాజీ, సప్తగిరి ఇతర కీలకపాత్రల్లో నటించారు. ఓటీటీ ప్రేక్షకులను అమిగోస్ ఎంతగా మెప్పిస్తుందో చూడాలి..
