Ashu Reddy: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే పడిచచ్చే వారిలో అభిమానులే కాదు, ఎందరో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి కూడా ఒకరు. పవర్‌స్టార్‌పై తనుకున్న అభిమానాన్ని ఇప్పటికే పలు సందర్భాల్లో బయటపెట్టిందీ అందాలతార. ఆ మధ్యన పవన్ కల్యాణ్ టాటూలను వేయించుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇటీవల హరి హర వీరమల్లు సెట్‌లో పవన్‌ను కలవడం, కాసేపు మాట్లాడటం తన జీవితంలో మరిచిపోలేని విషయాలంటూ భావోద్వేగానికి గురైంది. తాజాగా పవన్‌పై అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టిందీ సొగసరి. అదేంటంటే.. పవర్ స్టార్ నటించిన కాటమరాయుడి ఫస్ట్ షో చూడడం కోసం ఏకంగా జాబ్‌నే వదులుకుందట(Ashu Reddy Lost Her Job for Pawan Kalyan). ఇందుకు గానూ కుటుంబ సభ్యులు కూడా ఆమెను తిట్టారట. అయితే ఎప్పుడు కూడా దీనికి రిగ్రెట్ కాలేదట.
Also Read: RRR సర్వే : జనసేన వోట్ షేర్ ఇదేనా..?
ఆయనకు భక్తురాలిని అవ్వడం తనకు ఎంతో గర్వంగా ఉందంటూ ఈ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది అషూ రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే మెయిల్ నింజగానే పంపావా? డ్రాఫ్ట్‌లోనే ఉంది కదా? మెయిల్‌కు రిప్లై ఏం వచ్చింది? అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొద్ది సేపటికే డిలీట్ చేసింది అషూ. అయితే అప్పటికే స్ర్కీన్ షాట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.