Another Bumper Offer to Kala Pasha : కాలపాషా (షేక్ అహ్మద్) ఈ పేరును ఇప్పుడు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కాలాపాషా ఇప్పుడు ఫుల్ ఫేమస్. ఒకే ఒక డైలాగ్ తో తను సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయిన ఈ తాత ఇప్పుడు మరింత సెన్సేషన్ కావడానికి మరో అడుగు ముందుకు వేశాడు. ఇప్పటికే గుంటూరు కారం సినిమాలో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ లో అందరికీ మరింత చేరువైన కాలాపాషా, ఇప్పుడు మరోసారి ఇంకో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియా ద్వారా సెన్సేషనల్ క్రియేట్ చేసిన కాలాపాషా, మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఎంట్రీ ఇచ్చి, తన డైలాగ్ తో మొదలయ్యే పాటలో, తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ప్రసాద్ రికార్డింగ్ స్టూడియోలో థమన్ కాలాపాషాతో కుర్చిని మడత పెట్టి అంటూ వచ్చే సాంగ్ లో లిరిక్స్ తానే పాడానని థమన్ కి, మహేష్ బాబుకి, త్రివిక్రమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాడు కాలపాషా.
అయితే మరోమారు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కిచ్చుకున్నాడని ఒక వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో తెరకొక్కుతున్న నెక్స్ట్ గురూజీ సినిమాలో కాలాపాషా ఒక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం బయటికి రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. కాలాపాషా అదృష్టాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.