టాలీవుడ్ లో కొన్ని కొన్ని కాంబినేషన్ లు ప్రకటించిన నాటి నుండే వార్తల్లో నిలుస్తూ ఉంటాయి. అలాంటి మరో సూపర్ కాంబినేషన్ కు రంగం సిద్ధమైంది.
అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు నిర్మాతగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తుండగా కుమారి 21ఎఫ్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ అనే చిత్రం తెరకెక్కబోతోంది.
ఈ చిత్రంలో స్వామి రారా, కార్తికేయ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఫైనల్ చేస్తూ చిత్ర బృందం ప్రకటించింది.
18 పేజెస్ ప్రాజెక్ట్ లో అడుగుపెట్టిన విషయాన్ని అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ అనౌన్స్ చేసింది.
“ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు, ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ అభిమానులతో పంచుకుంది.
లాక్ డౌన్ లో పెళ్లి పీటలు ఎక్కిన నిఖిల్ పెళ్లి తర్వాత నటిస్తున్న చిత్రం ఇదే. గత చిత్రం అర్జున్ సురవరం నిరాశ పరచడంతో 18 పేజెస్ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పెళ్లి తర్వాత నిఖిల్ కి ఈ సినిమా ద్వారా అదృష్ట దేవత తలుపు తడుతుందా అనేది వేచి చూడాలి.