Anushka Shetty : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది స్వీటీ. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సత్తాచాటింది. అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇటీవల పూర్తిగా సినిమాలు తగ్గించిన అనుష్క.. చివరిగా నిశ్శబ్ధం మూవీలో నటించింది.

ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు అనుష్క. పైగా అనుష్క ఫ్యాన్స్ ఎంతగానో తన రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే వారికి ఇప్పుడు మరికాస్త సమయం పట్టేలా ఉందు. అనుష్క-నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో రానున్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’. ‘జాతిరత్నాలు’ తర్వాత నవీన్ పొలిశెట్టి, ‘నిశ్శబ్దం’ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అనుష్క.. వీరిద్దరూ నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.
Pawan Kalyan Bro Prerelease Event : నా ఊహల్లో హీరో అంటే ఆయనే..
ఈ చిత్రం ఆగస్టు 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం రిలీజ్ పై ఇప్పుడు సినీ వర్గాల్లో లేటెస్ట్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని మేకర్స్ అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడం కష్టమని తెలుస్తుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉన్నాయని, అందుకే సినిమా వాయిదా పడినట్టుగా టాక్ వినిపిస్తుంది. ఇక మేకర్స్ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం.