Anushka Shetty – Naveen Polishety : పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క. సూపర్ మూవీ హిట్ అవ్వడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించింది స్వీటీ. అనుష్క శెట్టి ఓ వైపు టాప్ హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాతో సత్తాచాటింది. ఇటీవల పూర్తిగా సినిమాలు తగ్గించిన అనుష్క.. చివరిగా నిశ్శబ్ధం మూవీలో నటించింది.
ఆ తరువాత వెండితెరపై కనిపించలేదు. స్వీటీ మూవీ అప్డేట్ కోసం ఆమె అభిమానులు గత రెండేళ్లగా ఎదురు చూస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి సరసన ఆమె నటించబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ ప్రచారం నిజమైంది. అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది.
మొత్తానికి ఈ సినిమా టైటిల్ ని “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అని అధికారికంగా ప్రకటించారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హోం బ్యానర్ యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. తనకంటే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అని స్టోరీ లైన్ తో ఈ మూవీని తెరకెక్కించినట్టు సమాచారం.
Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩
Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz
— UV Creations (@UV_Creations) March 1, 2023