ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలు పోటీలో ఉన్నాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇదిలా ఉండగా ఈ రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. ఈ క్రమంలోనే సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి చర్చించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ విషయం గురించి ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఏపీ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు 45 రూపాయలు చొప్పున టికెట్లు పెంచవచ్చని అనుమతి తెలిపినట్లు సమాచారం. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రచారం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు 25 రూపాయలు చొప్పున టికెట్లు రేట్లు పెంచడానికి అనుమతివ్వగా
వీరసింహారెడ్డి సినిమాకు మాత్రం 20 రూపాయలు మాత్రమే టికెట్ రేటు పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే బాలకృష్ణ సినిమాకు 5 రూపాయలు తగ్గించడానికి గల కారణం ఈయన ఈ సినిమాలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ డైలాగ్ చెప్పడమే కారణమని.. ఈ ఒక్క డైలాగ్ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతి టికెట్ పై ఐదు రూపాయలు(AP Government Fined Rs 5 For Veera Simha Reddy Movie Dialogue) చొప్పున ఫైన్ వేసింది అంటూ కొందరు ఈ విషయం పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.