AR Rahman : ఇన్నాళ్లు కలగా, అందని ద్రాక్షాల ఉన్న ఆస్కార్ అవార్డ్ ను సాధించి దేశం మొత్తం గర్వించేలా చేశారు కీరవాణి, చంద్రబోస్. RRR కు ఆస్కార్ రావాడంతో కొన్నాళ్లుగా అంతా ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు. ఈ సినిమా ఆస్కార్ సొంతం చేసుకోగా ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ క్రమంలో లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంచలన కామెంట్స్ చేశారు.
తన యూట్యూబ్ ఛానల్లో మ్యూజిక్ లెజెండ్ ఎల్ సుబ్రహ్మణ్యంతో మాటామంతీ నిర్వహించాడు. వీరిద్దరూ సంగీతం గురించి, మారుతున్న టెక్నాలజీ గురించి చర్చించారు. ఈ క్రమంలో రెహమాన్ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు మన సినిమాలు ఆస్కార్ వరకు వెళ్లి నిరాశతో వెనక్కు వస్తున్నాయి. అర్హత లేని సినిమాలను ఆస్కార్ కు పంపుతున్నారనిపిస్తుంది.
కానీ ఏం చేస్తాం చూస్తూ ఉండటం మాత్రమే చేయగలం అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆర్ఆర్ఆర్ తో పాటు గుజరాతీ చిత్రం చెల్లో షో కూడా ఆస్కార్ నామినేషన్ కు వెళ్ళింది. కానీ ఆ సినిమాకు అవార్డు దక్కలేదు. దీనిపై స్పందిస్తూ అర్హత ఉన్న RRR సినిమాను ఆస్కార్ కు పంపించకపోవడం గురించే ఆయన ఇన్ డైరెక్ట్ ఈ వ్యాఖ్యలు చేశాడంటున్నారు నెటిజన్లు.
Discussion about this post