David Warner: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ పలు వివాదాల నడుమ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకెళ్తుంది. అయితే తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇన్ స్టా లో ఓ వీడియో పోస్ట్ చేసాడు అది కాస్తా వైరల్ గా మారడంతో లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. డేవిడ్ వార్నర్ మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు.
తన పోస్ట్ చేసే ఫొటోలు, వీడియోలకు మిలియన్ల కొద్దా వ్యూస్, లైకులు వస్తుంటాయి. సూపర్ హిట్ పాటలు, మాస్ స్టెప్పులతో స్టార్ హీరోలను అనుకరిస్తుంటాడు. తరచూ ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో వార్నర్ హంగామా చేస్తుంటాడు. అప్పుడప్పుడు తెలుగు డైలాగ్స్ కూడా చెబుతుంటాడు.
ఆ మధ్య అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని డైలాగులు, పాటలతో వార్నర్ చేసిన హంగామా తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈక్రమంలో తాజాగా పఠాన్ సినిమాలో షారుఖ్ ఖాన్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడీ ఆసీస్ స్టార్ ప్లేయర్.
Also Read: బాలీవుడ్ ను బతికిస్తున్న పఠాన్.. మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు..
షారుఖ్ ఫేస్ ప్లేస్‌లో తన ఫొటోను రీప్లేస్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు. దీనికి ‘వావ్ వాట్ ఏ ఫిల్మ్.. ఈ సినిమాకు పేరు పెట్టగలవా..? #legend #icon’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం వార్నర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ.. షేర్ చేస్తున్నారు. దయచేసి డేవిడ్ వార్నర్‌కు ఆస్కార్ ఇవ్వాలంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram