Avatar 3 Trailer Review :అవతార్ 3 ట్రైలర్
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ప్రాంఛైజీ అవతార్ లో మూడవ భాగం రిలీజ్ కి రెడీ అవుతోంది. డిసెంబర్ 19న అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా కెమెరూన్ ప్రేక్షకులని తన పండోర ప్రపంచంలోకి తీసుకెళుతున్నారు.
విజువల్ వండర్ గా అవతార్ 3
అవతార్ 2లో సముద్రాల్లో విన్యాసాలు చూపించిన కామెరూన్ పార్ట్ 3లో పండోర గ్రహంలో అగ్నికీలలు సృష్టిస్తున్నారు. టైటిల్ లోనే ఫైర్ అండ్ యాష్ ఉంది. దీనితో పండోర గ్రహం రావణ కాష్టంలా రగిలిపోతోంది. ఉనా చాప్లిన్ ఈ చిత్రంలో ప్రధాన విలన్ గా యాష్ టీంకి లీడర్ గా నటిస్తున్నారు.
కేజ్ సల్లీ ఫ్యామిలీ, నవి ఫ్యామిలీ యాష్ టీంతో పోరాడుతున్న దృశ్యాలు థియేటర్స్ లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి.విజువల్స్ అయితే ఊహకందని విధంగా థ్రిల్ చేస్తున్నాయి.
జేమ్స్ కామెరూన్ ఈసారి కూడా లెక్క తప్పేలా లేరు.చూస్తుంటే డిసెంబర్ 19న వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిసేలా ఉంది. ఇప్పటికే అవతార్ చిత్రం ఈ వరల్డ్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ అగ్ని యుద్ధం థియేటర్స్ లో ఎలా ఉంటుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై కళ్లుచెదిరే అవతార్ 3 ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.