Baby OTT : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీ బేబీ. ఈ సినిమాను కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. SKN నిర్మించారు. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్, పాటలతో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్‌కు ప్రశంసలు లభిస్తోన్నాయి.
Naga Chaitanya : చైతూ రెండు పడవల ప్రయాణం..
బేబీ మూవీకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అదనపు బలం. నేటితరం యువత మనోభావాలకు అద్ధంపడుతూ స్వచ్ఛమైన ప్రేమకథగా దర్శకుడు సాయిరాజేష్ బేబీ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియెన్స్ నుంచి ప్రశంసలు లభిస్తోన్నాయి. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నది. అయితే ఈ మూవీ ఆగస్టు 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ ఓటీటీలో కూడా మంచి అంచనాలతో వసూల్ చేస్తుందని నమ్మకంతో ఉన్నారు చిత్ర నిర్మాతలు.
Vijay Sethupathi : ఆ మూవీకి రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా నటించేవాడిని..