Balagam OTT : సినిమాలు, కామెడీ షోలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నటుడు వేణు టిల్లు. బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. ‘దిల్’ రాజు వారసులు హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. ఇందులో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 3న చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ 20 రోజులు కంప్లీట్ అయ్యేసరికి 20.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను వసూలు చేసి సంచలనం సృష్టించింది. బలగం సినిమా బడ్జెట్ 2.2 కోట్ల లోపు మాత్రమే ఉండగా.. 20 రోజుల్లో ఏకంగా 20.5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అందుకుని.. నిర్మాత దిల్ రాజుకు కాసులు కృపించింది. తెలంగాణ సంస్కృతికి ప్రాముఖ్యత ఇవ్వడంతో కేటీఆర్ తో సహా రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ మూవీని ప్రమోట్ చేశారు.
థియేటర్లో విశేషంగా అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో, సింప్లీ సౌత్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సింప్లీ సౌత్ లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు.