Bhola Shankar : శక్తి, షాడో వంటి వరుస ఫ్లాప్ లతో ఉన్న డైరెక్టర్ మెహర్ రమేష్ కి మెగాస్టార్ చిరంజీవి ఓ అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్ లో ‘భోళా శంకర్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీ తమిళ్ చిత్రం వేదాళం మూవీకి రీమేక్ అని తెలిసిందే.
ఇందులో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లు కాగా ఇందులో కీర్తి సురేష్ హీరోకి చెల్లెలి పాత్రలో నటించనున్నట్టు సమాచారం. అయితే ఒరిజినల్ మూవీలో చెల్లెలి ప్రియుడు పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. అయితే తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్ర ప్రాముఖ్యత పెంచారు డైరెక్టర్. ఇప్పుడు ఆ యంగ్ హీరో సుశాంత్ అని తెలుస్తుంది.
ఈ రోజు సుశాంత్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ సుశాంత్ భోళా శంకర్ లో నటిస్తున్నట్టు ఓ పోస్టర్ ని రిలీజ్ చేసారు. దీన్ని బట్టి కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ పాత్రలో సుశాంత్ నటించనున్నట్టు తెలుస్తుంది. మొదట ఈ పాత్రకు నితిన్ ని అనుకున్నారు కానీ నితిన్ కి డేట్స్ అడ్జస్ కాలేదని సమాచారం. భోళా శంకర్ మూవీని AK ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తుండగా మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Discussion about this post