Bigg Boss Telugu Season 9: త్వరలో బిగ్ బాస్ ప్రారంభం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కి రంగం సిద్ధమవుతోంది. తొమ్మిదవ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. గత ఎనిమిది సీజన్లుగా బిగ్ బాస్ ఒకే పంథాలో కొనసాగుతోంది. ప్రేక్షకులకు కొత్తదనం అనిపించేలా ఎలాంటి మార్పులు జరగలేదు. దీంతో ఆడియన్స్ బిగ్ బాస్ పట్ల విసిగిపోయారు.

ఇదే కొనసాగితే బిగ్ బాస్ షో కి రేటింగ్స్ విషయంలో గండి తప్పదు. దీంతో అలర్ట్ అయిన బిగ్ బాస్ టీం తొమ్మిదో సీజన్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు, గేమ్స్, ఎలిమినేట్ చేసే విధానం అన్ని మారిపోబోతున్నాయట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. అదే సమయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల ఎంపిక కూడా పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది.

హౌస్ లోకి కన్నడ హాట్ హీరోయిన్ ఎంట్రీ
తాజాగా బిగ్ బాస్ 9 లోకి కన్నడ హీరోయిన్ కావ్య శెట్టి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎంపిక ఖరారు అయిందట. కావ్య శెట్టి కన్నడలో చాలా చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో గుర్తుందా శీతాకాలం చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. సోషల్ మీడియా లో తన హాట్ అండ్ గ్లామర్ లుక్స్ తో కావ్య శెట్టి బాగా పాపులర్ అయింది.

కన్నడ నటీమణులు ఎక్కువగా తెలుగు బిగ్ బాస్ లో సందడి చేయడం చూస్తూనే ఉన్నాం. గతంలో శోభ శెట్టి ఎంతలా పాపులర్ అయిందో.. అలాంటి క్రేజ్ పైనే కావ్య శెట్టి కూడా కన్నేసినట్లు తెలుస్తోంది. మరి కావ్య శెట్టి హంగామా హౌస్ లో ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. ఈ షో కి పోస్ట్ గా చేయబోతున్న నాగార్జునతో కావ్య షీట్ కి ఆల్రెడీ పరిచయం ఉంది. నాగార్జునతో కావ్య శెట్టి గతంలో కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ లో నటించింది.