BRO Censor Talk : గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. ఈ మూవీ తమిళ్ వినోదాయ సీతమ్ కి రీమేక్ అయినప్పటికీ దర్శకుడు సముద్రఖని, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి అనేక మార్పులు చేశారు. జులై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి క్లీన్ ‘యూ’ (U) సర్టిఫికెట్ జారీ చేసింది.
దీనికి సంబంధిత ఫొటోని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దర్శకుడు సముద్ర ఖని, సంగీత దర్శకుడు తమన్ అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 16 నిమిషాలని సమాచారం. ఆ మధ్య పవన్, వెంకటేష్ నటించిన ‘గోపాల గోపాల` కూడా యూ సర్టిఫికేటే పొందింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. చాలా గ్యాప్‌తో ఇప్పుడు `బ్రో` చిత్రానికి యూ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.
Allu Arjun : పుష్పరాజ్ దూకుడుకి బ్రేక్..
ఓ పెద్ద హీరోల సినిమాల నిడివి ఇంత తక్కువ ఉండటం కూడా ఆశ్చర్యపరిచే అంశమే. షార్ట్ అండ్ స్వీట్‌గా ఈ సినిమాని తెరకెక్కించారని అర్థమవుతుంది. ఐతే ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం బ్రో కి అయితే సెన్సార్ టాక్ అదిరిపోయింది అని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ని ఇస్తుందని, అలాగే డెఫినెట్ గా పవన్ ఎంట్రీ ఫ్యాన్స్ కి గుర్తుండిపోతుందంటున్నారు. వీటితో పాటుగా క్లైమాక్స్ లో ఇచ్చే ఎమోషనల్ సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుందని అంటున్నారు.
#BroTheAvatar is all set for 'U'niversal Entertainment 💥
Censored with U ✅
Grand Worldwide Release on July 28th 🥁@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @sujithvasudev @NavinNooli @lemonsprasad @SVR4446… pic.twitter.com/0z7Hsjbo4h
— People Media Factory (@peoplemediafcy) July 19, 2023