BRO Teaser Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్. తమిళ్ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ లపై అదిరే పోస్టర్ ని డిజైన్ చేశారు మేకర్స్. ఇందులో పవన్ లుక్ చూస్తుంటే తమ్ముడు మూవీలోని వింటేజ్ పవన్ గుర్తొస్తున్నాడు. ఈ పోస్టర్ లో మామ అల్లుళ్ళ లుంగీ కట్టి, మెడలో రెడ్ టవల్ వేసుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఒక్క పోస్టర్ తో మూవీ హైప్ మరింత పెంచేశారు. 1, 2 రోజుల్లో టీజర్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.