కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ కుంటాల జలపాతం వద్ద సందర్శనకు నిలిపివేసిన సమయంలో అక్కడికి ప్రవేశించి షూటింగ్ జరిపిన అల్లు అర్జున్ మరియు “పుష్ప” చిత్ర యూనిట్ పై అదిలాబాద్ జిల్లా నేరడిగొండ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. సమాచార హక్కు సాధన సమితి అనే సంస్థ ప్రతినిధులు ఈ ఫిర్యాదు చేసారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడికి ప్రవేశించి సినిమా చిత్రీకరణ చేశారని ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు