ఉయ్యాల జంపాల, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి చిత్రాల్లో నటించినా రానిపేరు ఒక్క బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా సొంతం చేసుకుంది పునర్నవి భూపాలం. బిగ్ బాస్ 3 సీజన్ వెళ్లొచ్చిన తర్వాత ఈ అమ్మడుకి ఇన్స్టా గ్రామ్ లో అమాంతం ఫాలోవర్లు పెరిగారు. దాంతో అప్పటివరకు పద్ధతిగా ఉండే ఈ భామ గ్లామర్ డోస్ కాస్త పెంచి హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
అంతేకాక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఎన్నో టీవీ షోలలో రాహుల్ సిప్లిగంజ్‌తో పునర్నవి భూపాలం చేసిన రొమాన్స్ చూసినవారు ఇద్దరి మద్యా ప్రేమాయణం నడుస్తుందనే అనుకున్నారు. కెమెరా కంటికి చిక్కిన ప్రతీసారి ఇద్దరు ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా తనకు కాబోయేవాడిని పరిచయం చేసి షాక్ ఇచ్చింది పునర్నవి. ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్‌లో చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని అవతలి అతను తొడిగిన ఫోటోను పోస్ట్ చేసింది. దీంతో ఈ అందాల బొమ్మ పెళ్ళి చేసుకునే వ్యక్తి ఎవరు అనుకునే లోపే తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది.
ఉద్భవ్ రఘునందన్ అనే యూట్యూబర్ ను పునర్నవి పెళ్లాడబోతుంది. ఇతడు యాక్టర్, రైటర్, ఫిలిం మేకర్ కూడా అని సమాచారం. యూట్యూబ్ లో చికాగో సుబ్బారావు పేరుతో ఉన్న ఛానల్ లో కొన్ని వీడియోలతో ఇతడు పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా రేపు మరింత సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు, జీవితంలో ముఖ్యమైన రోజంటూ ఈ జంట ప్రకటించారు.