Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే. ఎన్నో సందర్భాల్లో చిరు ఎంతో మంది ఆర్టిస్టులకు, సామాన్యులకు సైతం సాయం చేసిన విషయం మనకు తెలిసిందే. ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా నిర్విరామంగా సేవ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు చిరు.
టాలీవుడ్ సీనియర్ టెక్నీషియన్ అయిన సినిమాటోగ్రాఫర్ దేవరాజ్‌కు రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు(Chiranjeevi has donated Rs 5 lakh to veteran cinematographer P Devaraj). ఈ తరానికి తెలియకపోయినా.. దేవరాజ్ సినిమాటోగ్రఫి 80, 90 దశకంలోని సినీ ప్రియులకు తెలుసు. అప్పట్లో అందరూ స్టార్ హీరోస్ చిత్రాలకు దేవరాజ్ ఛాయాగ్రహణం అందించేవారు. కేవలం తెలుగులోనే కాకుండా.. హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాలకు తాను సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
Also Read: సూర్య భగవానుని జన్మ రహస్యం
కానీ ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఆర్థికంగానూ కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే వారిని తన ఇంటికి ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చారు. ఆ తర్వాత రూ. 5 లక్షల చెక్కును అందించారు. అంతేకాకుండా.. వారికి ఎప్పుడూ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిరంజీవి గొప్ప మనసుపై సినీ ప్రముఖులు.. అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Megastar @KChiruTweets
Offered assistance of Five Lakhs to Senior Cameraman #Devraj garu (Tingurangadu, Raani Kaasula Rangamma, Naagu, Puli Bebbuli fame).#Chiranjeevi #MegaStarChiranjeevi pic.twitter.com/9x0sJQ4TfE— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) February 2, 2023