Chiranjeevi Pan India Movie : గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో వరుస హిట్లో దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రెసెంట్ యంగ్ హీరోలతో పోటీగా మూవీ లైనప్ సెట్ చేసుకున్నాడు చిరు. ప్రస్తుతం మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ మూవీలో నటిస్తున్నాడు మెగాస్టార్. ఈ చిత్రంలో తమన్నా, హీరోయిన్ కాగా చిరు చెల్లిలో పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. అలాగే యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఆగస్టు 19న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

భోళాశంకర్ తర్వాత చిరు ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకరు బింబిసార మూవీ ఫేమ్ వశిష్ఠ కాగా మరొకరు బంగార్రాజు మూవీ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ. చిరుతో సోషియో ఫాంటసీ చేయడానికి వశిష్ఠ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటుండగా.. కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్ తో ఒక విభిన్నమైన కథాంశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడట. అయితే వశిష్ఠ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికర విషయం ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.
Infosys Sudha Murthy : ఆ మూవీతో అలియా ఏడ్పించేసింది..
వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా మాత్రం ఫుల్ టు ఫుల్ సోషియో ఫాంటసీ మూవీగా ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కథ మొత్తం డైరెక్టర్ చిరంజీవికి వివరించేశారట అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా ఉన్న చిరు పాన్ ఇండియా మూవీ గురించి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.