Chiranjeevi Pawan Kalyan : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో హిట్లు కొట్టిన చిరు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ చిత్రం వేదాళం మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇందులో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లు కాగా ఇందులో కీర్తి సురేష్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది.
అలాగే మరో యంగ్ హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మూవీని ఆగష్టు 11న విడుదల కానుంది. కాగా రేపు సాయంత్రం భోళా శంకర్ టీజర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక మరోవైపు తొలిసారిగా మామ అల్లుడు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో.

తమిళ్ మూవీ ‘వినోదయ సీతమ్’ సినిమాను తెలుగులో బ్రో ది అవతార్ గా పవన్ రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీనికి సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించనున్నారు. ఈ మూవీకి మాటలు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
జులై 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ ని మరో రెండు రోజుల్లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఇక ఈ రెండు సినిమాలపై భారీ లెవల్లో అంచనాలున్నాయి. రానున్ను 2,3 రోజుల గ్యాప్ లో మెగాస్టార్ భోళా శంకర్ టీజర్, పవర్ స్టార్ బ్రో టీజర్ తో మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఖాయం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.