Chiranjeevi: నటుడిగా తాను ప్రశముసలే కాదు విమర్శలు కూడా ఎదుర్కొన్నాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి. సింగర్ స్మిత త్వరలో నిజం విత్ స్మిత అనే టాక్ షోతో ముందుకు రాబోతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత, కెరియర్ విషయాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ షో ఒక వేదిక కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో ప్రసారం కానున్న ఈ షో మెగాస్టార్ చిరంజీతో ప్రారంభం కానుంది.

ఈమేరకు ఓ ప్రోమో కూడా విడుదలైంది. స్టార్‌డమ్ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది, ఆ స్టేజీకి వెళ్లడానికి ఎన్నో అవమానాలు పడి ఉంటారు, అవునా? అని స్మిత అడిగింది. దీనికి చిరు స్పందిస్తూ.. జగిత్యాలలో నాపై నుంచి పూల వర్షం కురిసింది. కొంత ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు విసిరారు అని తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించాడు చిరు.
Also Read : చికెన్ వండేటప్పుడు పెరుగు వాడొచ్చా, వాడకూడదా.. వాడితే ఏం జరుగుతుంది..!?
అసలు తనపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు? మెగాస్టార్ పంచుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలియాలంటే ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! అయితే అదే రోజు పవన్ కళ్యాణ్ ఆన్ స్టాపబుల్ పార్ట్ 2 ప్రసారం కానుంది. ఈ రెండు ఎపిసోడ్ల మధ్య పోటీ ఉండనుండగా ఏ ఎపిసోడ్ కు ఏ రేంజ్ లో వ్యూస్ వస్తాయో చూడాలి.
