Chiru Leaks Pics : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలతో పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్యతో హిట్లు కొట్టిన చిరు హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్విట్జర్లాండ్ లో జరుగుతుంది. ఈ మూవీ తమిళ్ చిత్రం వేదాళం మూవీకి రీమేక్ అని తెలిసిందే. ఇందులో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లు కాగా ఇందులో కీర్తి సురేష్ హీరోకి చెల్లెలి పాత్రలో నటిస్తుంది.

అలాగే మరో యంగ్ హీరో సుశాంత్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మూవీని ఆగష్టు 11న విడుదల కానుంది. అయితే ఇటీవల ఓ పాట చిత్రీకరణ కోసం మూవీ యూనిట్ భూతల స్వర్గం స్విట్జర్లాండ్ వెళ్లింది. దీనిపై తాజాగా చిరంజీవి అప్డేట్స్ ఇస్తూ.. ఫోటోస్ లీక్ చేశారు. “స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది.
ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం.. అప్పటివరకూ ఈ ‘చిరు లీక్స్’ పిక్స్” అంటూ లోకేషన్ ఫోటోస్ షేర్ చేశాడు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. దీంతో “ఒక సాంగ్ లీక్ చేయండి బాస్ అని ఒకరు”… “బాస్.. గేమ్ ఛేంజర్ సినిమా గ్లింప్స్ లీక్ చేయవా” అంటూ మరొకరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది!
ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం !
అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2023
