Dasara Trailer : సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంపిక చేసుకొని ప్రేక్షకులచేత న్యాచురల్ స్టార్ అనిపించుకున్నాడు నాని. వైవిధ్యమైన కథల ఎంపిక ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నాని. కొంతకాలంగా సరైన హిట్ లేని నాని ఆశలన్నీ పాన్ ఇండియా మూవీ దసరా పైనే పెట్టుకున్నాడు.
న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో ఈ మూవీ ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా తాజాగా విడుదలైన దసరా ట్రైలర్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. థియేట్రికల్ ట్రైలర్ ని లక్నో లో గ్రాండ్ ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేసారు మేకర్స్.
ట్రైలర్ లో నాని పెర్ఫార్మన్స్, డైలాగ్స్, స్టైల్.. మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కీర్తి సురేష్ ఇందులో కొత్తగా కనిపించగా, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ BGM అదిరిపోయింది. ప్రస్తుతం దసరా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. మార్చి 30న ఈ మూవీని విడుదల చేయనున్నారు మేకర్స్.