మాస్ మహారాజ్ రవితేజ.. ఈ పేరులో ఏదో తెలీని ఎనర్జీ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో కష్టపడి ఎదిగిన వారిలో రవితేజ ఒకరు. ఒకప్పుడు చిన్నాచితకా వేషాలు వేసుకుంటూ ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. రవి తేజ లైఫ్ ని టర్న్ చేసింది మాత్రం ‘నీకోసం’. అందులోని టైటిల్ సాంగ్ ఇప్పటికి ప్రేమికుల ప్లే లిస్ట్ లో కనిపిస్తూనే ఉంటుంది.
రవితేజకు హీరోగా బ్రేక్ ఇచ్చింది మాత్రం పూరీ జగన్నాథ్ ‘నేనింతే’. అందులోని డైలాగ్స్ ఎవరు మర్చిపోలేరు. అంతెందుకు రవితేజ కూడా ఇప్పటికీ ఈ సినిమాపోతే ఇంకొకటి, అది పోతే మరొకటి చేస్తూనే ఉంటాను సినిమా ఒక్కటే నాకు తెలిసింది అని అనేక ఫంక్షన్స్ చెప్తూనే ఉంటాడు.
ఖడ్గం, వెంకీ, భద్ర, విక్కమార్కుడు, దుబాయ్ శీను, కిక్, బలుపు, క్రాక్ వంటి బ్లాక్ బాస్టర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరోవైపు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, శంభో శివ శంభో వంటి డిఫరెంట్ మూవీస్‌లోనూ నటించారు. ఒకప్పుడు రవితేజ అంటే.. మినిమం గ్యారంటీ ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో రవితేజ సినిమాలు ఒకప్పటిలా ఉండట్లేదు. మనం ఒకప్పుడు చూసిన రవితేజ ఇతను కాదేమో అనిపిస్తుంది.
వరుస పరాజయాలతో అభిమానులను నిరుత్సాహ పరిచాడు. నిప్పు, బలుపు, పవర్, బెంగాల్ టైగర్, డిస్కో రాజా, టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా వరుస ఫ్లాప్ ల మధ్య క్రాక్ వస్తే మూవీ వస్తే రవితేజ ఇస్ బ్యాక్ అని ఆనందించే లోపే ఖిలాడి అని మళ్లీ రాడ్ మూవీ వచ్చింది.
దాని నుంచి కోలుకోక ముందే రామరావు ఆన్ డ్యూటీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు రవితేజ సినిమా హిట్టు కొట్టినా, ఫ్లాప్ అయినా నటనకు ఎప్పుడు మంచి మార్కులే పడ్డాయి కానీ కథల ఎంపిక విషయంలో ఆచితూచి సెలెక్ట్ చేసుకుంటే.. ఈ ఫ్లాప్ లకు చెక్ పెట్టొచ్చు లేదంటే.. రవితేజను ఒకప్పటి సినిమాల్లోనే చూసునే పరిస్థితి ఏర్పడుతుందేమో అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతుంటే..
అప్పుడొచ్చాడు “ధమాకా” అంటూ.. స్క్రీన్ పై మ్యాజిక్ చేసాడు. మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధమాకా’.. క్రిస్మస్ బరిలో చాలా సినిమాలే వచ్చిన ధమాకా మాత్రమే రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసింది.
క్రిస్మస్ కి వచ్చిన సినిమాలు వచ్చినట్టే కొట్టుకుపోతే.. ఒక్క ధమాకా మాత్రం 10 రోజులు అవుతున్న కలెక్షన్స్ లో(Dhamaka Movie Collections) ఎక్కడ తగ్గడం లేదు.. ఇప్పుడు ఆ డిజాస్టర్స్ కు బదులు తీర్చుకుని రికార్డ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తున్నాడు. ఇప్పటికే 90 కోట్లకు పైగా వసూలు చేసిన ధమాకా త్వరలో 100 కోట్ల మార్క్ ని టచ్ చేసేలా ఉంది. రవితేజ దూకుడు చూస్తుంటే సంక్రాంతి వరకు ఈ జోష్ తగ్గేలా లేదు.