Dhanush Sir Movie Review : తమిళ స్టార్ హీరో, సింగర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇంతవరకు తెలుగు సినిమాల్లో నటించని ధనుష్ కేవలం డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే తాజాగా ధనుష్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” మూవీలో నటించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా నిర్మించారు. ఈ నెల 17న విడుదల కానున్న సార్ మూవీపై విశ్లేషణ.
ఇటీవల పెద్దగా సక్సెస్ లేని ధనుష్ ఈ మూవీతో హిట్ కొట్టాలని ధీమాగా ఉన్నాడు. ఇందులో ధనుష్ కి జోడిగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటించింది. చదువు, దాని గొప్పదనం తెలిపే నేపధ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అండ్ త్రివిక్రమ్ సొంత బ్యానర్ ఫార్చ్యున్ ఫోర్ సంయుక్తంగా ఈ మూవీని తెరకెక్కించారు. అలాగే త్రివిక్రమ్ ఈ సినిమాకు త్రివిక్రమ్ డైలాగ్స్ రాసాడని టాక్.
ఈ సినిమా తమిళ్ లో “వాతి” పేరుతో విడుదల అవుతుండగా.. టాలీవుడ్ లో విడుదలకు ముందే లాభాలు వచ్చాయని సమాచారం. సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ఈ సినిమా గురించి పాజిటివ్ గా స్పందించారు. సార్ మూవీ ఫైనల్ ఎడిటింగ్ పూర్తైందని ధనుష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని, సినిమా చాలా బాగుందని ఆయన అన్నారు.
ధనుష్ కు మరో హిట్ పడనుందని, వైవిధ్యమైన కథల ఎంపికలో ధనుష్ ముందుంటాడని ఆయన కామెంట్ చేయడం గమనార్హం. సార్ మూవీ నిడివి 2 గంటల 17 నిమిషాలు కాగా తక్కువ నిడివితోనే విడుదలవుతుండడంతో ఈ మూవీకి ప్లస్ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి తోడు డైరెక్టర్ వెంకీ అట్లూరి తన శైలికి భిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు.
అంతకు ముందు నితిన్ తో “రంగ్ దే” తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి సినిమాలు క్లాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటాయి. అయితే ఈ సినిమాను మాత్రం డైరెక్టర్ క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించాడని టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తగానికి సార్ మూవీతో డైరెక్ట్ తెలుగు మూవీతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న ధనుష్ కి, మొదటిసారి మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న వెంకీకి హిట్ పడుతుందేమో చూడాలి.