Sir OTT: తమిళ స్టార్ హీరో, సింగర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇంతవరకు తెలుగు సినిమాల్లో నటించని ధనుష్ కేవలం డబ్బింగ్ సినిమాలతో మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. అయితే తాజాగా ధనుష్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో “సార్” మూవీలో నటించాడు. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా నిర్మించారు. ఇందులో ధనుష్ కి జోడిగా భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ నటించింది.
చదువు, దాని గొప్పదనం తెలిపే నేపధ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్ అండ్ ఫార్చ్యున్ ఫోర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 17వ తేదీ విడుదలై మొదటి షో నుంచే పాసిటివ్ టాక్ సంపాదించుకుంది. మొదటిరోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ మూవీ తెలుగు, తమిళ భాషలను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా డిజిటల్ మీడియాలో థియేటర్లో ఐదు వారాలను పూర్తి చేసుకున్న తర్వాతే ప్రసారం కానుందని తెలుస్తుంది. అయితే త్వరలోనే దీనికి సంబంధించిన ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారకంగా తెలియజేయనుంది.