Director Krish: డైరెక్టర్ క్రిష్ ఆసక్తికర వ్యాఖ్యలు
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన హరిహర వీరమల్లు చిత్రం విడుదలైంది. క్రిష్ ఈ చిత్రం నుంచి మధ్యలో తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. క్రిష్ తెరకెక్కించినంత వరకు ఈ మూవీ బావుందని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది.
క్రిష్ ప్రస్తుతం అనుష్క శెట్టితో ఘాటి అనే చిత్రం రూపొందిస్తున్నారు. క్రిష్ నెక్స్ట్ మూవీ బాలయ్యతో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా క్రిష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ హరిహర వీరమల్లుపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఆ నిజాలు బయటపడతాయి, పవన్ తో విభేదాలు లేవు
తాను హరిహర వీరమల్లు చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నాను అనే కారణాలు త్వరలోనే బయటపడతాయని క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తనకి పవన్ కళ్యాణ్ తో ఎలాంటి విభేదాలు లేవని క్రిష్ స్పష్టం చేశారు. నాకు పవన్ కి మధ్య వీరమల్లు చిత్రం విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ ఏమాత్రం లేవు. భవిష్యత్తులో ఆయనతో మరో సినిమా చేసేందుకు నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను అని క్రిష్ అన్నారట.
హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కి ముందు క్రిష్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరమల్లు తన ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నారు అంటూ క్రిష్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా క్రిష్ ఈ చిత్రం కోసం అద్భుతమైన కథని తీసుకువచ్చారని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామెంట్స్ చేశారు.