DJ Tillu 2 : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన చిత్రం డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేసాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే డీజే టిల్లు లో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి ఈ సినిమాలో నటించదంటూ ముందుగానే చెప్పేసారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించే అవకాశం ఉందంటూ నెట్టింట న్యూస్ వైరల్ అయ్యింది. ఈమూవీలో హీరోయిన్ గా తొలుత శ్రీలీలను అనుకున్నా.. అనుపమా పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. ఇప్పటికే అనుపమ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అనుపమ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది.
టిల్లు స్వ్కేర్ మూవీలో అనుపమ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అనుపమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మూవీ యూనిట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఇందులో అనుపమ చబ్బీ అండ్ ట్రెండీ లుక్స్‌లో కట్టిపడేస్తుంది. ఈ మూవీని సమ్మర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్ట్‌టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. డీజే టిల్లును మించిన సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి..
Wishing the very gorgeous, our @anupamahere a very happy birthday.🤩 – team #TilluSquare #HBDAnupamaParameswaran ✨#Siddu @MallikRam99 @ram_miriyala @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/kCjtLPegij
— Sithara Entertainments (@SitharaEnts) February 18, 2023