నందమూరి నట సింహం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. మాస్ ప్రేక్షకులు మెచ్చే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. బాలకృష్ణ ఇటు సినిమాలోతోనూ, అటు రాజకీయాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన ఎంత కోపంగా కనిపిస్తారో.. అంతే ప్రేమ కూడా కురిపిస్తుంటారు.
అందుకే బాలయ్యను అభిమానులు అంతగా ఇష్టపడుతుంటారు. బాలయ్య ఫస్ట్ టైం హోస్ట్ గా ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో చేస్తున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 1 ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే. దీంతో అన్ స్టాపబుల్ షో సీజన్ 2ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే అన్ స్టాపబుల్ షో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. సీజన్ 2 లో మెగాస్టార్, వెంకటేష్, నాగార్జున కూడా వస్తారని క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈసారి అంతా దబిడి దిబిడే అంటూ బాలయ్య తనదైన స్టైల్ లో కామెంట్ చేశాడు.
ఇక చివరిలో యాంకర్ వచ్చి బాలయ్యను మామయ్య అని పిలవచ్చా అని అడగ్గా.. దీంతో బాలయ్య తనదైన స్టైల్ స్పందిస్తూ.. నా మనవళ్లు నన్ను తాతయ్య అని పిలవరు.. నువ్వు మావయ్య అని పిలుస్తావా అనగా… అప్పుడు యాంకర్ మీ మనవళ్లు ఏమని పిలుస్తారు అని అడగ్గా.. బాలా అని ముద్దుగా పిలుస్తారని చెప్పుకొచ్చాడు.
