Eesha Rebba: ఆహా.. ఈషా.. రెబ్బాను చూస్తుంటే అల్లాడిపోవాల్సిందే
Eesha Rebba: అచ్చ తెలుగు అందంతో, అద్భుతమైన అభినయ సామర్థ్యంతో సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న నటి ఈషా రెబ్బా తాజాగా తన గ్లామరస్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
వరంగల్‌లో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగిన ఈషా రెబ్బాకు సినీ పరిశ్రమలో సరైన స్టార్‌డమ్ లభించలేదనే అభిప్రాయం ఉంది. తెలుగు అమ్మాయిని కావడం వల్లే తనకు రావాల్సినంత గుర్తింపు, అవకాశాలు రావడం లేదని ఈషా గతంలో పలు సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, పట్టుదలతో మంచి పాత్రలు ఎంచుకుంటూ ఆమె తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
తొలుత మోడల్‌గా పనిచేసిన ఈషా రెబ్బా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘అవే’ వంటి విభిన్న చిత్రాలతో నటిగా తన ప్రతిభను చాటుకున్నారు. మాస్ స్టార్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఆమెకు సెకండ్ లీడ్‌గా అవకాశం లభించినప్పటికీ, తన పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలు ఎడిటింగ్‌లో తొలగించబడటంపై ఆమె బాధపడ్డారు.
ఆ తర్వాత ‘సుబ్రహ్మణ్యపురం’, ‘సవ్యసాచి’, ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’, ‘మామ మశ్చీంద్ర’ వంటి చిత్రాలతో పాటు, ‘పిట్టకథలు’, ‘మాయబజార్ ఫర్ సేల్’, ‘దయా’ వంటి క్రేజీ వెబ్ సిరీస్‌లలోనూ నటించి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
నటనతో తీరిక లేని సమయంలోనూ ఈషా రెబ్బా పుస్తకాలు, నవలలు చదవడానికి ఆసక్తి చూపిస్తారు. తొలి రోజుల్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, పాత్రలకు అనుగుణంగా మారేందుకు కఠినమైన జిమ్ వర్కవుట్స్ ద్వారా బరువు తగ్గారు. అయితే, ప్రయాణాలకు వెళ్లినప్పుడు మాత్రం ఆహార నియమాలను పాటించకుండా, ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ వంటకాలను తప్పకుండా రుచి చూడతానని ఆమె గతంలో తెలిపారు. తాజా ‘బాహుబలి దోశ’ ఫోటోషూట్ కూడా ఆమె ‘ఫుడీ’ స్వభావాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంలో ఆమెకున్న ఆసక్తిని తెలియజేస్తుంది.
