Fans have Problems with the Release of Salar : సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సలార్. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులను అలరించబోతుంది. కానీ ఈ సినిమా రిలీజ్ కాకముందే ఫ్యాన్స్ కి ఇబ్బందులను గురిచేస్తుంది. రిలీజ్ కి రెండు రోజుల సమయం ఉండడంతో ఫ్యాన్స్ కు ఉత్కంఠత నెలకొంది. టికెట్స్ కోసం ఎగబడుతున్నారు. ఈవారం మొత్తం వారి ప్రమోషన్స్ కూడా చేస్తామని ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ తెలిపారు.
దాంట్లో భాగంగానే ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వి రాజ్ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఇది పక్కన పెడితే క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక నిన్న తెలుగు స్టేట్స్ లో సలార్ బుకింగ్స్ ప్రతి చోట లేట్గా ఓపెన్ చేశారు. అయినా కూడా భారీ బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఇక నైజాం రిలీజ్ విషయంలో కూడా పూర్వ వైభవం అంటూ కొన్ని సింగిల్ స్క్రీన్స్ లో రిలీజ్ డేట్ కు టికెట్స్ ఇస్తున్నట్టు ప్రకటించేశారు. ఇంకా దాంతో ఫాన్స్ కి ఇబ్బందులు తప్పలేదు.
థియేటర్స్ లో టికెట్స్ ఇస్తున్నట్టు తెలియడంతో భారీ ఎత్తున ఫ్యాన్స్ రావడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఎంతకీ ఫ్యాన్స్ కంట్రొల్ కాకపోవడంతో పోలీసులు లాఠి చార్జి కూడా చేశారు. సలార్ మూవీ మేకర్స్ కరెక్ట్ ప్లానింగ్ లేకపోవడం వల్లనే ఇలా జరిగిందని ఫ్యాన్స్ దెబ్బలు తీనాల్సి వచ్చిందని ఇప్పుడు ఒక న్యూస్ ట్రోల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా ఉండడంతో, హోంబోలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ లో కూడా ఒక రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కానీ ఫ్యాన్స్ ఇబ్బంది లేకుండా మూవీ మేకర్స్ ప్లానింగ్ చేసుకొని ఉంటే బాగుండేది.