Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR మూవీ తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలం వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 మూవీ షూటింగ్ లో బిజీ అవ్వడంతో గేమ్ ఛేంజర్ మూవీకి లాంగ్ గ్యాప్ వచ్చేసింది. అయితే ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేయనిదే శంకర్ ఏ సినిమాలను పూర్తి చేయడానికి వీలు లేదని లైకా ప్రొడక్షన్ ఆంక్షలు విధించడంతో ఇంకో ఆప్షన్ లేక శంకర్ ఇండియన్ 2 మూవీ షూట్ లో బిజీ అయిపోయాడు.

మరోవైపు చరణ్ కూడా వ్యక్తిగత కారణాలతో షూట్ కి గ్యాప్ ఇచ్చాడు. దీంతో షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. దీంతో ఈ వ్యవహారం ప్రొడ్యూసర్ దిల్ రాజుకి తలనొప్పిగా మారింది. దిల్ రాజు ఎక్కడకు వెళ్లినా అప్డేట్.. అప్డేట్ అంటూ ఫ్యాన్స్ తెగ గోల చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా గేమ్ ఛేంజర్ నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల దిల్ రాజుపై నెగటివ్ ట్వీట్ ని ఇండియా వైడ్ గా వైరల్ చేసిన విషయం తెలిసిందే.
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 వచ్చేస్తుంది..
ఈ క్రమంలో దిల్ రాజు గేమ్ ఛేంజర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేషాలను చిత్రీకరించడానికి హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలనును దిల్ రాజు రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. శంకర్ పర్యవేక్షణలో శైలేష్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ లోని కొన్ని యాక్షన్ సీన్స్ ని షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
