GopiChand RamaBanam : రెవల్యూషనరీ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు గోపిచంద్. తన డెబ్యూ మూవీ తొలి వలపుతో అందరిని ఆకర్షించాడు. వెంటనే తేజ దర్శకత్వంలో వచ్చిన జయం, వర్షం వంటి సినిమాల్లో విలన్ గా చేసి తన నటనతో మరో కోణాన్ని చూపించాడు. అనంతరం కెరీర్ పరంగా ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొన్నాడు గోపిచంద్. ఆక్సిజన్, ఆరడుగుల బుల్లెట్టు, చాణక్య, పంతం వంటి డిజార్డర్ సినిమాలో తన ఖాతాలో ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన సీటిమార్ కొంత పర్వాలేదు అనిపించింది.
కానీ ఆ తర్వాత వచ్చిన మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ తో మళ్లీ నిరాశ పరిచాడు. దీంతో ప్రస్తుతం గోపిచంద్ ఆశలన్నీ రామబాణం సినిమాపైనే ఉన్నాయి. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ చేసిన సినిమా రామ బాణం. ఈ సినిమాను క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాడు శ్రీవాస్. గోపీచంద్ సరసన ఖిలాడి బ్యూటీ డింపుల్ హయతి హీరోయిన్‌గా నటించింది.
జగపతి బాబు, గోపీ అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో.. ఇప్పటికే ప్రమోషన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు మేకర్స్. ఇంకా చెప్పాలంటే వినూత్నంగా చేస్తున్నారు. జనాల్లోని ఈ మూవీని తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఏకంగా పాల ప్యాకెట్స్ పై సినిమా పోస్టర్, రిలీజ్ డేట్ ని ప్రింట్ చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మూవీ టీం. చూడాలి మాచో స్టార్ ఈ మూవీతో అయినా హిట్ కొడతాడేమో..