Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ గుంటూరు కారం. ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. అయితే ఈ గుంటూరు కారం మూవీని మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుస్తున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. అయితే గతకొంత కాలంగా ఈ మూవీలో చిన్నచిన్న మార్పులు చేసి మళ్లీ షూటింగ్ లో వేగం పెంచారు మేకర్స్.

ఆగింది అనుకున్న షూట్ మళ్లీ స్టార్ట్ అవ్వడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు లేదు మళ్లీ షూటింగ్ బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. మహేష్ బాబు కొడుకు గౌతమ్ లండన్ లో చదువుతున్న విషయం తెలిసిందే. అయితే మహేష్ గౌతమ్ తో కలిసి జులై 19న లండన్ వెళ్లనున్నాడట. దీంతో గుంటూరు కారం షూటింగ్ కు మరోసారి బ్రేక్ పడిందట. మళ్లీ షూట్ ఆగడంతో ఫ్యాన్స్ డిసపాయింట్ అవుతున్నారు.
Priya Prakash Warrior : పాకిస్థాన్ లోనూ అభిమానులున్నారంటున్న యంగ్ బ్యూటీ..
ఇలా వరుసగా పోస్ట్ పోన్ చేస్తూ వెళ్తే మూవీ సంక్రాంతికి రిలీజ్ కష్టమే అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎలా అయితే ఎలా అన్నా అంటూ కామెంట్ చేస్తున్నారు మరికొందరు. పైగా గుంటూరు కారం మూవీ షూట్ నవంబర్ లోగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో రాజమౌళితో చేయనున్న SSMB29 ట్రైనింగ్ లో మహేష్ పాల్గొనాల్సి ఉంది. మహేష్ మళ్లీ ఎప్పుడు వచ్చి షూట్ లో పాల్గొంటాడో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Rashmi Gautam Traditional Pics : రష్మీ లేటెస్ట్ ట్రెడిషనల్ పిక్స్..