Guntur Karam : సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. మహేష్ బాబు లోని మాస్ యాంగిల్ కంప్లీట్ గా బయటకు తీసే సినిమా ఇదాని ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్ చెప్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేకకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే దీపావళికి గుంటూరు కారం సినిమాలోని ఒక పాటను రిలీజ్ చేసే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తుంది. దీపావళి కానుకగా విడుదల చేయనున్న ఈ పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా కొన్ని సెట్స్ వేసి కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఒక పాటను కూడా చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఆ పాటకు సంబంధించిన లిరికల్ సాంగ్ దీపావళికి సందడి చేయనుంది.
శ్రీలీల మహేష్ బాబు పై చిత్రీకరించినన్న ఈ పాట మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది. దీపావళి లోపు ఈ పాట చిత్రీకరణ పూర్తవ్వకపోతే స్టిల్స్ తో అయినా గాని లిరికల్ వీడియోని రిలీజ్ చేయనున్నారు. అదే జరిగితే మహేష్ బాబు ఫ్యాన్స్ కి దీపావళి డబుల్ ధమాకానే..