Gunturu Karam Movie : మీనాక్షి చౌదరి ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పేరు అటు తమిళ్,ఇటు తెలుగు ఇండస్ట్రీలో మారు మ్రోగుతుంది. తన అంద చందాలతో కుర్రకారు హృదయాలను బంధించే ఈ అమ్మడు వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తుంది. మొదట్లో ఆశించినంత అవకాశాలు రాకపోయినప్పటికీ రాను, రాను పెద్ద హీరోల సరసనే సినిమా అవకాశాలు కొట్టేస్తుంది. ముందుగా ఈ ముద్దుగుమ్మ “ఇచట వాహనాలు నిలపరాదు”, “కిలాడి” లాంటి సినిమాల్లో నటించింది. కానీ అవి ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయాయి.
దాని తర్వాత అడివి శేషుతో “హిట్ 2” సినిమాలో నటించింది. మంచి అంచనాలతో బరిలోకి దిగిన ఆ సినిమా చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ అమ్మడు తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమాలో హీరోయిన్ పాత్రను చేజిక్కించుకుంది. మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ఎంపిక కావడంతో ఈ అమ్మడి దశ తిరిగిందని చెప్పవచ్చు. అయితే ఇది ఇలా ఉండగా..
ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ ని మీనాక్షి చౌదరి అందుకుంది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగులో నటిస్తున్న “లక్కీ భాస్కర్” అనే సినిమాలో దుల్కర్ సల్మాన్ కు హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నీ ఎంపిక చేశారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. అయితే మీనాక్షి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది.
ముందు ఈ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా అనుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. కానీ ఏవో కారణాలవల్ల ఆ సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకుంది. తర్వాత శ్రీలీలను హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్ పాత్రకు మీనాక్షి చౌదరిని కన్ఫామ్ చేశారు త్రివిక్రమన్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది.
ఇప్పటికే గుంటూరు కారం సెకండ్ షెడ్యూలు మొదలైంది. దాంట్లో భాగంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు పై ఒక సోలో సాంగ్ నీ చిత్రీకరిస్తున్నారు. ఆ సాంగ్ ను చాలా భారీగా రూపొందిస్తున్నారని టాక్. ఆ సాంగ్ తర్వాత ఉండబోయే కొన్ని ఇంటి సన్నివేశాల్లో హీరోయిన్స్ శ్రీ లీల, మీనాక్షి చౌదరి ఇద్దరు పాల్గొంటారట.
అయితే ఈ అందాల భామ రీసెంట్ గా మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “మట్కా” సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. 1960 సంవత్సరంలో విశాఖపట్నంలో జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమాను తీస్తున్నారని వినికిడి. దాంట్లో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి నటించనుంది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి మొదటగా సినిమా రంగానికి రాకముందు ఒక మోడల్.
2018 లో ఆమె ఫేమినా మిస్ ఇండియాగా ఎంపికైంది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 లో ఫస్ట్ రన్నారప్ గా నిలిచింది. అయితే ఈ అమ్మడు సినిమా రంగంలోకి రాకముందే ఫోటోషూట్స్ తో అదరగొట్టేసింది. ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన ఈ భామ 2019లో హాట్ స్టార్ లో వచ్చిన “ఔట్ ఆఫ్ లవ్” అనే వెబ్ సిరీస్ లో మొదటిసారి నటించింది. అంతకుముందే కొన్ని వీడియో ఆల్బమ్స్ లో నటించిన మీనాక్షి చౌదరి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. రాబోయే రోజుల్లో మీనాక్షి చౌదరి ఇంకా ఎన్నో అవకాశాలను దక్కించుకొని మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలి.