Hansika Motwani: దేశముదురుతో ఆపిల్ బ్యూటీ ఎంట్రీ
ఆపిల్ బ్యూటీ హన్సిక గతంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కొంతకాలం పాటు తెలుగు సినిమాల్లో హన్సిక క్రేజ్ కొనసాగింది. దేశముదురు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హన్సిక యువతని విపరీతంగా ఆకర్షించింది. తన క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో కుర్రకారుని ఫిదా చేసింది.
ఆ తర్వాత హన్సిక మస్కా, కందిరీగ, దేనికైనా రెడీ, సింగం 2 లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఇటీవల హన్సికకి అవకాశాలు బాగా తగ్గాయి. అయితే తాజాగా హన్సిక వైవాహిక జీవితం గురించి రూమర్స్ మొదలయ్యాయి. జాతీయ మీడియాలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి కథనాలు వెలువడుతున్నాయి.

హన్సిక విడాకుల రూమర్స్
ఈ వార్తల ప్రకారం హన్సిక తన భర్త సోహైల్ తో విడిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2022లో హన్సిక సోహైల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడికి ఇది రెండవ వివాహం. అయినప్పటికీ హన్సిక అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లయిన మూడేళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం వీరిద్దరూ వేర్వేరుగా జీవిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. హన్సిక ప్రస్తుతం తన తల్లితో.. సోహెల్ తన తల్లిదండ్రులతో ఉంటున్నారట. అయితే హన్సిక, సోహెల్ ఇద్దరూ విడిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
ఇటీవల హన్సికతో విడాకులు గురించి వస్తున్న వార్తలని సోహైల్ ఖండించాడు. అయితే తామిద్దరం వేర్వేరుగా జీవిస్తున్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.