Hari Hara Veera Mallu Teaser : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మొన్నటి వరకు ఈ సినిమాపై అంత బజ్ లేదు. పైగా ఈ సినిమా దర్శకుడు క్రిష్‌కు కూడా ఇప్పటివరకు కమర్షియల్‌గా పెద్ద హిట్టు లేదు. అయితే పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచేసింది. ఎంతలా అంటే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్‌లు హిందీ హక్కుల కోసం కోట్లు ఆఫర్ చేసేంతలా.
మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో రూపొందుతోన్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమైంది. ఇప్పటికే కొన్ని పోస్టర్ లు టీజర్ లు పవర్ గ్లాన్స్ లు అంటూ చాలానే వచ్చి గట్టి హైప్ సెట్ చేసాయి. తాజాగా ఈ జనవరి 26నే సినిమా నుంచి అసలు సిసలు మెయిన్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
దీనితో సినిమాపై ఓ క్లారిటీ కూడా వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. జనవరి 26 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ.. రికార్డులు బ్రేక్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ. దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఎమ్. ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.