Hari Hara Veeramallu Review: హరిహర వీరమల్లు ట్విట్టర్ రివ్యూ
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ప్రీమియర్ షోలు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. నిధి అగర్వాల్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ నిర్మించారు. ఏఎం రత్నం నిర్మించారు. గత కొన్ని రోజులుగా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ తో ఈ చిత్ర మ్యానియా క్లియర్ గా కనిపించింది. స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగడంతో ఫ్యాన్స్ ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది.
హరిహర వీరమల్లు చిత్రంపై ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా ఈ మూవీ ఉందా ? పవన్ కళ్యాణ్ తన అభిమానులకు హిట్ చిత్రానికి గిఫ్ట్ గా ఇచ్చారా ? అనే విషయాలు ట్విట్టర్ రివ్యూలో చూద్దాం. కృష్ణ తీరంలోని కొల్లూర్ మైన్స్ ప్రాంతంలో కథ మొదలవుతుంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్, వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ల ఎంట్రీ చకచకా జరుగుతుంది.
ఫస్ట్ హాఫ్ లో హైలైట్స్ ఇవే
పవన్ కళ్యాణ్ ఎంట్రీ సన్నివేశం అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే కుస్తీ ఫైట్ సన్నివేశం మరో గూస్ బంప్స్ స్టఫ్ అనే చెప్పాలి. పవన్, నిధి అగర్వాల్ మధ్య ప్రేమ సన్నివేశాలు, కొన్ని కామెడీ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టకుండా సాగుతుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ లో చార్మినార్ ఫైట్ సన్నివేశంలో పవన్ కళ్యాణ్ అదరగొట్టేశారు. విజిల్ వర్తీ గా ఆ సీన్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సాలిడ్ ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అన్నట్లుగా సాగుతుంది. కీరవాణి అయితే తన బిజియంతో సన్నివేశాలకి ఇంకా బలం పెంచారు.
కాస్త నెమ్మదించిన సెకండ్ హాఫ్
ఇక సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా మొదలవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ 30 నిమిషాలు బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. విఎఫెక్స్ కూడా మైనస్ అనిపిస్తాయి. ఆ తర్వాత నుంచి సెకండ్ హాఫ్ కూడా పిక్ అప్ అవుతుంది. క్లైమాక్స్ ని ఫ్యాన్స్ సంతృప్తి చెందేలా ఎండ్ చేశారు. నిధి అగర్వాల్ తన పెర్ఫార్మెన్స్ తో, గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంది. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచేలా క్లైమాక్స్ ఎండింగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో కోహినూర్ మిషన్ కీలకంగా ఉంటుంది. ఓవరాల్ గా హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద సత్తాచాటే అంశాలు ఉన్న చిత్రమే అని చెప్పాలి.