Harihara Veeramallu Ticket Price : హరిహర వీరమల్లు టికెట్ ధరలు
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ కి సంబంధించిన ఒక్కో కార్యక్రమం పూర్తవుతూ వస్తోంది. తాజాగా ఏపీలో హరిహర వీరమల్లు టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. పెరిగిన టికెట్ ధరల వివరాలు కూడా జీవోలో పొందుపరిచారు.
టికెట్ ధరలు పెంచడం మాత్రమే కాదు, ఫ్యాన్స్ పండగచేసుకునే అంశం కూడా ఉంది. అదేంటంటే హరహర వీరమల్లు ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూవీ రిలీజ్ కి ముందు రోజు జూలై 23న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రీమియర్ షోలకు కూడా ప్రభుత్వం టికెట్ ధరని నిర్ణయించింది.
ఇక జూలై 24నుంచి రెగ్యులర్ షోలు ప్రారంభం అవుతాయి. మొదటి 10 రోజులు అంటే జూలై 24 నుంచి ఆగష్టు 2 వరకు పెరిగిన టికెట్ ధరలు అమలులో ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం హరిహర వీరమల్లు టికెట్ ధరల వివరాలు ఒకసారి పరిశీలిద్దాం.
ప్రీమియర్ షోలు
23వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శించుకోవచ్చు.
టికెట్ ధర : రూ.600 (జీఎస్టీ అదనం)
రెగ్యులర్ షోలు(జూలై 24 నుంచి ఆగష్టు 2 వరకు)
సింగిల్ స్క్రీన్ లోయర్ క్లాస్ : రూ.100 పెంపు
సింగిల్ స్క్రీన్ అప్పర్ క్లాస్ : రూ.150 పెంపు
పెంచిన తర్వాత టికెట్ ధరలు రూ.200 నుంచి రూ.297 వరకు ఉంటాయి.
మల్టిప్లెక్స్ : రూ.200 పెంపు
పెంచిన తర్వాత టికెట్ ధరలు రూ.377 వరకు ఉంటాయి.

ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. సినిమా కంటెంట్ పై, పవన్ కళ్యాణ్ క్రేజ్ పై చిత్ర యూనిట్ భారీ ఆశలు పెట్టుకుని ఉంది. ట్రైలర్ కి ఇప్పటికే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఆడియన్స్ థియేటర్స్ కి రావడం లేదనే చర్చ చిత్ర పరిశ్రమలో జరుగుతోంది. ఈ తరుణంలో ఇంత భారీ స్థాయిలో టికెట్ ధరలు పెంచడం ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. సినిమాపై ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి టికెట్ ధరలు సమస్య కాబోవని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు.