వైవిధ్యమైన సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఇప్పటివరకు హీరోగా మెప్పించిన సత్యదేవ్.. ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో విలన్‌గానూ అదరగొట్టాడు. ప్రతి నాయకుడిగా ఈ హీరో నటనకు ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటించిన గుర్తుందా శీతాకాలం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా, మేఘా ఆకాష్ కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యదేవ్.. ఫిల్మ్ కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టులో ఎదురైన ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆయనకు ఎదురైన సంఘటన ఏంటంటే..? సాధారణంగా సూసైడ్ బాంబర్స్ ట్రిగర్స్ ను కాలిసాక్స్ లో ఉంచుకుంటారు.
ఆ విషయం సత్యదేవ్ కి తెలియదు. ఓసారి ఎయిర్ పోర్ట్ లో సత్యదేవ్ పక్కనున్న వ్యక్తి పాస్ పోర్ట్ తన కాలులో పెట్టుకున్నాడు. అతడు పాస్ పోర్ట్ తీయటానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు అనుమానించి అతడితో పాటు సత్యదేవ్ ని కూడా సూసైడ్ బాంబర్ అనుకుని అరెస్ట్ చేశారట. అంతే నా కర్మ కాలిపోయింది. సౌండ్స్ ఏమైనా వినిపించినప్పుడు వెనక్కి, ముందుకు కదిలేవాడిని. ఒకవేళ టార్గెట్ మిస్ అవ్వుద్దేమో అని ” అంటూ చెప్పుకొచ్చారు.
