ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ.. షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందులో క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు ఒకటి కాగా మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. అయితే ఈ ప్రాజెక్ట్ లు పూర్తి కాకముందే పవన్ కళ్యాణ్ సాహో డైరెక్టర్ సుజిత్ తో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు.
అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించనున్నారట. ఇటీవల ఆఫీషియల్ గా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ బట్టి చూస్తుంటే సుజిత్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు జపాన్, ముంబై నేపథ్యంలో ఈ సినిమా కథ కొనసాగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందుకున్న రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. మూవీ నిర్మాత దానయ్య ఈ చిత్రానికి 170 కోట్ల బడ్జెట్ ని పెట్టబోతున్నాడని తెలుస్తోంది. అయితే అందులో 70 కోట్లు పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కి 25 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారని సమాచారం. పవన్ సుజిత్ కాంబోలో వస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించనున్నారు.