How Much is Salaar Movie Collections? : యంగ్ రెబల్ స్టార్ సలార్ గా వచ్చి మనల్ని అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లను వసూలు చేసింది. 1000కోట్ల క్లబ్ లో ఈ సినిమా కూడా చేరుతుందన్న అంచనాలలో ఇప్పుడు ఎందుకో స్వల్ప అనుమానం కలుగుతుంది. అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఏ ఒక్కచోట కూడా బ్రేక్ ఈవెన్ అవలేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం 75% వసూలు మాత్రమే ఇప్పటివరకు వచ్చాయి అని తెలుస్తుంది.
మిగిలిన 25% వసూళ్లు వచ్చేనా అని అనుమానాలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. ఈ వీకెండ్ లో ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా థియేటర్లు జనాలతో నిండితే సలార్ కు మళ్ళీ కలెక్షన్లు సునామి మొదలవుతుంది. 25% కూడా నూతన సంవత్సరంలో పూర్తవుతాయి అని ఇండస్ట్రీ వర్గాలు ఒక అంచనా వేస్తున్నారు. అయితే కేజీఎఫ్ 2 మాదిరిగా 1000 కోట్ల వసూళ్లు మాత్రం సాధ్యమయ్యే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం పోవడం గమనార్హం.

ఒకవేళ లాంగ్ రన్ లో 800 కోట్లకు వచ్చి ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు. యానిమల్ సినిమా కంటే కూడా సలార్ వసూళ్ల విషయంలో చాలా వెనుకబడి ఉందని చెప్పవచ్చు. అలాగే సలార్ కు పోటీగా డంకీ సినిమా వచ్చింది. అంతేకాకుండా కన్నడ నాటలో సలార్ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.
అక్కడి నుంచి వస్తాయనుకున్న వసూళ్లు కేవలం 50% మాత్రమే ఉన్నాయి. హిందీ వర్షన్ లో కూడా సలార్ కి ఆశించినంత స్థాయిలో స్పందన రాలేదు. దాంతో ఓవరాల్ గా 1000 కోట్ల వసూళ్లను సలార్ రీచ్ చేయలేకపోతుందేమో అని బాక్స్ఆఫీస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
