Pawan Kalyan Unstoppable 2: తొలి ఎపిసోడ్ నుంచే భారీ ఆదరణ తెచ్చుకున్న అన్‌స్టాపబుల్ 2 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఫైనల్ ఎపిసోడ్ ఎంతో పవర్ ఫుల్ గా ఉండాలని ప్లాన్ చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని రంగంలోకి దించారు. అంతేకాదు రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్ రూపొందించారు. అయితే అన్‌స్టాపబుల్ 2 పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తొలి భాగం ఇప్పటికే ఆహాలో స్ట్రీమ్ అవుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది.
గతంలో ఎన్నడూలేని విధంగా కేవలం 24 గంటల్లోనే 150 మిలియన్ల వ్యూస్ రాబట్టి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. ఇక ఈ ఎపిసోడ్‌ను చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. వీటన్నింటినీ ఆహా రీట్వీట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఒక మహిళ టీవీలో పవన్ రాగానే హారతినిచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ఆహా రీ ట్వీట్ చేస్తూ ఎసిపోడ్‌ను ఆదరిస్తున్నవారందరికీ ధన్యవాదాలు తెలిపింది.
Gallery: Ananya Nagalla Hot Photos
కాగా బాలయ్య- పవన్ ముచ్చట్లకు సంబంధించిన రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ఆదివారం (ఫిబ్రవరి 5) విడుదల చేయనున్నట్లు ఆహా మేకర్స్ తెలిపింది. ‘బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ పార్ట్ 1 కి పగిలిపోయే రికార్డ్స్ జాతర జరిగింది. భీమ్లా నాయక్ పవర్ సాక్షిగా, బద్రీనాథ్ పొగరు సాక్షిగా చెబుతున్నాం.. పార్ట్ 2 తో సెన్సేషన్ డెఫినేషన్ మార్చడానికి మేము రెడీ. మీరు రెడీనా?’ అంటూ ట్వీట్ చేసింది ఆహా.
🔥 Thank you so much @ahavideoIN Team Such A Great Episode. We'll Remember Forever ❤️🙏
Our Cheif @PawanKalyan 🧎🧎🙏 🥺Can't Wait to Watch Part 2 on Feb10th#PawanKalyanOnUnstoppable. pic.twitter.com/wCokcp29vT
— 🦅GHANI BHAI بهاي🦁 (@BheemlaBoy1) February 3, 2023
Baap of all episodes Part 1 ki pagilipoye records jathara jarigidndhi. Bheemla Nayak power saakshiga, Badrinath pogaru sakshi ga chepthunnam, part 2 tho sensation definition marchadaniki memu ready⚡️. Meeru ready na?#PawanKalyanOnUnstoppable #PawanKalyanOnAha @PawanKalyan pic.twitter.com/TqpzQIOZnX
— ahavideoin (@ahavideoIN) February 4, 2023